ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

68చూసినవారు
ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా గ్రామంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్లకు వ్యతిరేకంగా తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాటం చేసిన గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, గంగాధర్, కిషన్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్