రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను త్వరగా పూర్తి చేయాలని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మద్నూర్ మండల కేంద్రంలోని తాహశీల్దార్ కార్యాలయంలో ఎంపీడీవో, ఎంపీవో లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు.