ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన జుక్కల్ ఎమ్మెల్యే

60చూసినవారు
ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన జుక్కల్ ఎమ్మెల్యే
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు జుక్కల్ నియోజకవర్గ ఆడపడుచులకు, అక్కాచెల్లెళ్లకు, చిన్నారులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, ఆడపడుచులకు ప్రతీకైన బతుకమ్మ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని, ఆడపడుచులందరూ కలిసి ఆడే గొప్ప పండుగ బతుకమ్మ అని అన్నారు.

సంబంధిత పోస్ట్