జుక్కల్ నియోజకవర్గం ఎస్సీ వర్గీకరణతోపాటు మరో 10 డిమాండ్ల సాధన కోసం ఈనెల 6వ తేదీ నుంచి చేపట్టనున్న బైక్ యాత్రను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రుసేగాం భూమయ్య పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కామారెడ్డి నుంచి బైక్ యాత్ర ప్రారంభమై అన్ని మండలాల మీదుగా నెలరోజులపాటు కొనసాగుతుందని తెలిపారు.