విద్యాశాఖలో సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు గత 15 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ప్రాధిపతికన చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారు. వీరందరికీ ప్రభుత్వం ఏర్పడగానే రెగ్యులర్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇవ్వడం జరిగింది. సంవత్సరం గడిచినా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయలేకపోవడంతో కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా సమ్మె నిర్వహిస్తున్నారు. గురువారం చేతికి సంకెళ్లు బిగించుకొని నిరసన వ్యక్తం చేశారు.