ధ్యానం ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైనప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉండడంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భునేకర్ సంతోష్ అన్నారు. శనివారం ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకొని గాలిపూర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో ధ్యాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు