కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో గల రక్తనిధి కేంద్రంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో లయన్స్ క్లబ్ కామారెడ్డి అధ్యక్షులు సీనియర్ న్యాయవాది శ్యాం గోపాల్ 75 వ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలవడం జరిగిందని రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలు తెలియజేశారు. రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాతలకు అభినందనలు తెలిపి రక్తదాతలకు ప్రశంసా పత్రాలను అందజేశారు.