మట్టి గణపతిని పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లా ప్రజలకు సూచించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లోని వివిధ శాఖల అధికారులకు, సిబ్బందికి పర్యావరణహితమైన మట్టి గణపతులను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.