సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలి: వీసీలో మంత్రి సీతక్క

61చూసినవారు
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలి: వీసీలో మంత్రి సీతక్క
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, అధికారులతో మాట్లాడారు. వర్షాలు, వరదలతో ఎలాంటి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించి కూల్చివేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్