సదాశివనగర్: ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వయం పాలన దినోత్సవం
సదాశివనగర్ అడ్లూరు ఎల్లారెడ్డి హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో గురువారం బాలల దినోత్సవం పురస్కరించుకొని స్వయం పాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు, విద్యార్థినిలు ఉపాధ్యాయుల వేషధారణలో పాఠాలు బోధించారు. విద్యార్థులకు స్వీట్లు పంచారు. బాలల దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు బిల్యా నాయక్, ఉపాధ్యాయులు జి. నర్సయ్య, చింతల సురేష్, నిఖిత పాల్గొన్నారు.