రేపు అడ్లూరు ఎల్లారెడ్డి రైతు వేదికలో రైతునేస్తం కార్యక్రమం

55చూసినవారు
రేపు అడ్లూరు ఎల్లారెడ్డి రైతు వేదికలో రైతునేస్తం కార్యక్రమం
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలోని రైతు వేదికలో రేపు మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం ఉదయం 10 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉంటుందని ఏఈవో కళ్యాణి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యాసంగిలో వరి పంట సాగు, నారుమడి, యాజమాన్యంపై వ్యవసాయ శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు అందిస్తారని పేర్కొన్నారు. రైతులు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్