చిన్న తక్కడపల్లి పోషన్ అభియాన్ కార్యక్రమం

669చూసినవారు
చిన్న తక్కడపల్లి పోషన్ అభియాన్ కార్యక్రమం
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలంలోని చిన్నతక్కడ పల్లి తుపదల్ గ్రామంలో గల అంగన్వాడి కేంద్రంలో పోషన్ అభియాన్ కార్యక్రమం పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం సర్పంచ్ లక్ష్మి అశోక్ పటేల్ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రంలో ద్వారా ప్రభుత్వం గర్భిణీలకు బాలింతలకు పౌష్టికంతో కూడిన ఆహారమును అందజేస్తున్నారు. దీనివల్ల పుట్టి ప్రతి బిడ్డ ఆరోగ్యవంతంగా ఉండాలని ప్రభుత్వ లక్ష్యమని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా అంగన్వాడీ కేంద్రం ద్వారా వచ్చే పోషక ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలన్నారు. దీనివల్ల తల్లి పిల్ల ఆరోగ్యవంతంగా ఉంటారని ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు సూపర్వైజర్ నసీమా అంగన్వాడి కార్యకర్త ఎం మహానంద మరియు చంద్రకళ తోపాటు గర్భిణీలు బాలింతలు గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్