అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

67చూసినవారు
అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
తెలంగాణ వీర వనిత, ఉద్యమకారిని చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఎల్లారెడ్డి మున్సిపల్ ఆఫీస్ ముందు ఉన్నఆమె విగ్రహనికి తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘం సభ్యులు గురువారం పూలమాల వేసి నివాళులు ఆర్పించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు బబ్లు, డివిజన్ అధ్యక్షులు మార్లు సాయిబాబా, ఉపాధ్యక్షులు మార్లు సాయిలు, కోశాధికారి రొడ్డ సాయిబాబా, మండల అధ్యక్షులు అమృత్ రావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్