కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం రామారెడ్డి- ఇసన్నపల్లి గ్రామాల మధ్య దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక సింధూర పూజలు నిర్వహించారు. మంగళవారం కావడంతో ఆలయానికి భక్తులు వచ్చి భక్తీ శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయ గర్భగుడిలో వేదపండితులు శ్రీనివాస్ శర్మ మంత్రోచ్ఛారణలతో పాలాభిషేకం, సింధూర, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లాతో పాటు నిజామాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్ తదితర జిల్లాల భక్తులు ఆలయానికి తరలివచ్చారు.
ప్రత్యేక క్యూ లైన్ ద్వారా దేవుని దర్శనాన్ని కల్పించారు. పట్టీల ద్వారా భక్తులు రూపాయల రూపంలో 5, 350 రూపాయల దండ కట్టారు. అన్న ప్రసాద వితరణ ( భక్తులకు అన్నదానం) నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ బుర్ల ప్రభు గుప్తా, మాజీ ఆలయ ధర్మకర్తలు మాస్కల రాజేందర్ గౌడ్, భాస్కర్ రెడ్డి, ఇసాయిపేట భైరయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు, రాజకీయనాయకులు, వ్యాపారులు, వైద్యులు, ఆలయ జూనియర్ అసిస్టెంట్ సురేందర్ గుప్తా, సిబ్బంది నాగరాజు తదితరులు పాల్గొన్నారు.