సదాశివనగర్ మండల ఉప తహసిల్దార్ గా ప్రవీణ్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు ఈయన కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కు సీసీగా వ్యవహరించారు. సదాశివ నగర్ కు బదిలీపై వచ్చారు. రెవెన్యూ సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటానని, మెరుగైన సేవలందించడానికి తనకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు సహకారం అందించాలని కోరారు.