హైదరాబాద్ నుండి ఎల్లారెడ్డి వస్తున్న టిఆర్టీసీ బస్సులో ఆదివారం రాత్రి ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన ఎండి. నయీమ్(30) గుండెపోటుతో మృతి చెందాడు. నర్సాపూర్ వద్ద ప్రయాణికుడు గుండెనొప్పితో పడిపోగా అతన్ని సమీప మెదక్ ఆసుపత్రి చేర్పించేలోపే ప్రాణాలు కోల్పోయినట్లు అదే బస్సులో ప్రయాణిస్తున్న ఎల్లారెడ్డి వార్డు కౌన్సిలర్ భూంగారి రాము తెలిపారు. మెదక్ నుండి నయీమ్ శవన్ని ఎల్లారెడ్డికి అంబులెన్స్ లో తరలించారు.