కెప్టెన్సీతో పాటు పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ మద్దతుగా నిలిచాడు. రోహిత్ శర్మ తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. ‘అతను చాలా సంవత్సరాలుగా భారత జట్టును ముందుండి నడిపించాడు. రోహిత్ సామర్థ్యంపై అనుమానం అనవసరం. అతని ఫామ్ తిరిగి వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఒకటి లేదా రెండు ప్రదర్శనలతో ఒకరి కెప్టెన్సీని అనుమానించకూడదు’ అని కపిల్ చెప్పుకొచ్చాడు.