కుంభమేళాలో ఆకర్షించే కళ్లతో పూసలు అమ్ముతూ రాత్రికి రాత్రే ఫేమస్ అయిన మోనాలిసా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో పుష్ప -2 మూవీ పోస్టర్ ముందు ఆమె దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'ఇప్పుడు పోస్టర్ బయట. రేపు పోస్టర్ లోపల. కాలచక్రం అంటే ఇదే. త్వరలోనే ముంబైలో కలుద్దాం' అంటూ ఆమె ట్విట్టర్ Xలో చెప్పుకొచ్చింది. కాగా 'ది డైరీ ఆఫ్ మణిపుర్' చిత్రంలో మోనాలిసా నటించనుంది.