ఏపీ మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ దూసుకెళ్తోంది. హిందూపురం మున్సిపాలిటీ టీడీపీకి కైవసమైంది. హిందూపురం మున్సిపల్ చైర్మన్‌గా ఆరో వార్డు కౌన్సిలర్ డీఈ రమేశ్ 23 ఓట్లు సాధించి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా తహసీన్ ఎన్నికయ్యారు. 29 ఓట్ల మెజారిటీతో గెలిచారు.