అల్ఫోర్స్ లో అట్టహాసంగా శ్రావణ శుక్రవారం మరియు రాఖీ వేడుకలు

70చూసినవారు
అల్ఫోర్స్ లో అట్టహాసంగా శ్రావణ శుక్రవారం మరియు రాఖీ వేడుకలు
శ్రావణ మాసం చాలా విశిష్టమైనదని,సకల శుభాలను కలిగించేదని తద్వారా సుఖవంతమైన జీవితాన్ని గడపవచ్చని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా.వి. నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక వావిలాలపల్లె లోని అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్నెక్ట్స్ లో శ్రావణ లక్ష్మీ విశిష్టతను తెలిపే సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రారంభానికి ముందు వారు శ్రీమహా లక్ష్మీ మాతకు వారు పూజా కార్యక్రమాన్ని ఆచరించి విద్యార్థులందరికి ఆశీస్సులందించారు. శ్రావణ మాసంలో వివిధ శుభకార్యాలను మరియు పుణ్య కార్యక్రమాలను పెద్ద సంఖ్యలో నిర్వహిస్తారని తద్వారా ముక్కోటి దేవతల కృపను పొందగలుగుతామని అభిప్రాయపడ్డారు. శ్రావణ మాసం అనగానే చాలా మందికి గుర్తుకు వచ్చేది వరలక్ష్మీ శుక్రవారమని ఈ పరమ పవిత్రమైన రోజున మహిళా మూర్తులందరు సౌభాగ్యవతులై పలు రకాలు గౌరీ వ్రతాలను చేపట్టి తోటి మహిళలతో ఆనందాన్ని పంచుకోవడమే కాకుండా వాయనాలు ఇస్తారని గుర్తుచేశారు. అన్నా దమ్ముల మరియు అక్కా చెల్లల బందాన్ని పటిష్టపరిచే రాఖీ పౌర్ణమి ఈ మాసంలోనే వస్తుందని ఈ పండుగ సోదరభావాన్ని పెంపొందించడమే కాకుండా సంబంధాలను పటిష్ఠపరుస్తాయని అభిప్రాయపడ్డారు. ప్రపంచం వ్యాప్తంగా ఈ వేడుకను చాలా ఆచార సాంప్రదాయాలతో నిర్వహించుకుంటారని గుర్తుచేసారు.

సంబంధిత పోస్ట్