గుంతలు త్రవ్వి నెలలు - పట్టించుకోని అధికారులు.. బాధ్యులెవరు..?
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాలకు, ఎంపీడీవో కార్యాలయంకు వెళ్లే దళిత వాడ దారిలో విచక్షణ రహితంగా గుంతలు తవ్వి పూల్చకుండా వదిలేశారు. దానిలో ప్రయాణికులు ఆ వార్డులో నివసించే ప్రజలు ప్రయాణిస్తూ ఆ గుంతల్లో తరచూ పడుతూ ప్రమాదాలకు, ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్య పట్ల అధికారులు, నాయకులు స్పందించి వెంటనే పరిష్కారం చూపించి, ప్రమాదాలు నివారించాలని దళిత నాయకులు కోరుతున్నారు.