సిరిసిల్ల సెస్ పరిధిలో ని అంబేద్కర్ నగర్ లో 35ఏళ్ల క్రితం వేసిన విద్యుత్ స్థంభాలు ఒక్కొక్కటిగా విరిగిపోతున్నాయి. గతంలో పాత విద్యుత్ స్థంభాలు తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తామన్న సెస్ పాలకవర్గం, కేవలం మెయిన్ రోడ్డు పక్కన ఉన్న స్థంభాలు మార్చి చేతులు దులుపుకున్నారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఇకనైనా పాత విద్యుత్ స్థంభాలను తొలగించి నూతన స్థంభాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.