అయ్యప్ప మాలధరణ దీక్ష చేపట్టిన స్వాములు శుక్రవారం రుక్మాపూర్ నుంచి అయ్యప్ప స్వామి దర్శనానికి శబరిమలై తరలి వెళ్లారు. ఈ సందర్భంగా గురుస్వామి ఆధ్వర్యంలో ఇరుముడికి సంబంధించిన ప్రత్యేక పూజలు నిర్వహించి, కుటుంబ సభ్యులు వారిని సాధారణంగా శబరిమలైకి పంపించారు. 41 రోజులపాటు కొనసాగి ఈ దీక్ష శబరిమలైలో అయ్యప్ప స్వామి దర్శనంతో ముగుస్తోంది.