
గంగాధర: మజీద్ కు మైక్ సౌండ్ సిస్టమ్ కానుకగా ఇచ్చిన జయపాల్ రెడ్డి
గంగాధర మండలం మంగపేట గ్రామ పంచాయితీలో దాదాపు 150 మంది ముస్లిం సోదరులు కలిసి మజీద్ ను గత 12 సంవత్సరాల క్రితం నిర్మాణం చేశారు. ఆ మజీద్ కు 12 సంవత్సరాల నుండి మైక్ సౌండ్ సిస్టం లేదు. ఇట్టి విషయాన్ని మజీద్ కమిటీ సభ్యులు కొత్త జయపాల్ రెడ్డిని కోరగా, దాదాపు 30, 000 రూపాయలతో పూర్తి మైక్ సౌండ్ సిస్టంను కొని ఇయ్యడం జరిగినది. ముస్లిం సోదరులు, మంగపేట వారు కొత్త జయపాల్ రెడ్డికి కృతఙ్ఞతలు తెలిపినారు.