Jan 26, 2025, 06:01 IST/
'పద్మ' అవార్డులపై మరోసారి స్పందించిన సీఎం
Jan 26, 2025, 06:01 IST
'పద్మ' అవార్డుల ప్రకటనలో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపించిందని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి విమర్శించారు. పక్క రాష్ట్రాని(ఏపీ)కి ఐదు అవార్డులు ఇచ్చినప్పుడు తెలంగాణకు నాలుగు ఇచ్చినా రాష్ట్ర పెద్దలందరికీ గౌరవం దక్కేదన్నారు. తొందర్లోనే దీనిపై ప్రధానికి లేఖ రాయబోతున్నట్లు తెలిపారు. అన్యాయం జరిగినప్పుడు నిరసన తెలపాల్సిన అవసరం ఉందన్నారు. దీన్ని ప్రజాస్వామ్య యుతంగా తెలియజేస్తామని వెల్లడించారు.