స్వర్ణాంధ్ర విజన్ దిశగా కూటమి అడుగులు: గవర్నర్

77చూసినవారు
స్వర్ణాంధ్ర విజన్ దిశగా కూటమి అడుగులు: గవర్నర్
AP: స్వర్ణాంధ్ర విజన్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని గవర్నర్ నజీర్ అన్నారు. ఆదివారం విజయవాడలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసి సమస్యలు సృష్టించింది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేలా చేసింది. ప్రజలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం కలగాలనేదే ప్రభుత్వ నినాదం.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్