రాజమౌళి - మహేష్ బాబు పాన్ వరల్డ్ సినిమా కోసం హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా ఓకే అయినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం ఆమె తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. ప్రస్తుతం హాలీవుడ్‌లో ఒక్కో ప్రాజెక్ట్‌కు రూ. 45 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్న ప్రియాంక చోప్రా.. ఎస్ఎస్ఎంబీ 29కు దాదాపు రూ. 80 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే రాజమౌళి మాత్రం ఆమెకు రూ. 30 కోట్ల వరకే ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.