Jan 17, 2025, 15:01 IST/కరీంనగర్
కరీంనగర్
పెద్దపల్లి: ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి
Jan 17, 2025, 15:01 IST
పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన 42 పడకల ఆసుపత్రి భవనాన్ని ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీ హర్ష శుక్రవారం అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మాణం అవుతున్న 42 పడకల ఆసుపత్రి భవనాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రి భవన నిర్మాణం పనులను జనవరి చివరి వారంలోగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు.