వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తాళ్లపెల్లి రాజు (37) అనే గీత కార్మికుడు శుక్రవారం సాయంత్రం తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడి తీవ్ర గాయాలైయ్యాయి. గమనించిన స్థానికులు రాజును చికిత్స నిమిత్తం జమ్మికుంట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.