ఇనుప రాడ్డుతో ముగ్గురిపై దాడి

26897చూసినవారు
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం రామనపల్లిలో మంగళవారం దారుణం జరిగింది. ఓ వ్యక్తి ఇనుప రాడ్డుతో ముగ్గురిపై దాడికి తెగబడ్డాడు. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు మల్లన్న, రాజు, రమేష్ అనే ముగ్గురు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రవి అనే వ్యక్తి ఇనుప రాడ్డుతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో మల్లన్న తలకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్