కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామానికి చెందిన బండి వంశీ అనే యువకుడు ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని గ్రామస్తులు తెలిపిన విషయం విధితమే. కాగా కమలాపూర్ మండలంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఒడితల ప్రణవ్ సమాచారం తెలుసుకొని అమెరికా మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ప్రభుత్వపరంగా మృతదేహం తరలింపు విషయంలో కృషి చేస్తానని తెలిపారు.