బక్రీద్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

62చూసినవారు
బక్రీద్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
హుజురాబాద్ నియోజకవర్గంలోని ముస్లింలకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఆయన జమ్మికుంటలో బక్రీద్ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. స్వార్థం, అసూయ, రాగధ్వేషాలు లేని త్యాగనిరతిని వ్యాపింపజేయడమే బక్రీద్‌ ముఖ్య ఉద్దేశం అని అన్నారు. కార్యక్రమములో మున్సిపల్ చైర్మెన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, జమ్మికుంట పిఏసిఎస్ చెర్మైన్ పొనగంటి సంపత్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్