పెండింగ్ బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచులు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ కు సోమవారం ప్రజావాణి లో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనవసరంగా మమ్ములను పోలీసుస్టేషన్ లో పెట్టి కేసులు నమోదు చేయడం దారుణం అని సర్పంచులు మండిపడ్డారు. గ్రామ పంచాయతీలలో తాము చేసిన అభివృద్ధి పనులకు కు సంబంధించిన పెండింగ్ బిల్లులను చెల్లించిన తరువాతనే ఎలక్షన్ నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు