దివ్వాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జగిత్యాల కలెక్టర్ కార్యాలయం ముందు దివ్యాంగులు బుధవారం ధర్నా చేపట్టారు. అంతకు ముందు కొత్త బస్ స్టాండ్ చౌరస్తా వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ప్రతి దివ్వాంగులకు రూ. 6000 పెన్షన్ ఇవ్వాలని, ఉచిత బస్ ప్రయాణం కల్పించాలని, దివ్వాంగుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.