ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఆర్జీలను జాప్యం లేకుండా పరిష్కరించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రజల నుండి 46 ధరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, రాంబాబు, గౌతమ్ రెడ్డి, కలెక్టరేట్ పరిపాలనాధికారి హన్మంత రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.