దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో పర్యటిస్తున్న తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధుల బృందం 'మాసో రిసోర్స్ రికవరీ ప్లాంట్'ను సదర్శించారు. ఈ ప్లాంట్ లో రోజుకు వెయ్యి టన్నుల వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నారు. వ్యర్థాల రీసైక్లింగ్ కు 'వెస్ట్ టు ఎనర్జీ' టెక్నాలజీని సియోల్ నగరపాలక సంస్థ వాడుతోంది. ఈ పర్యటనలో బాగంగా ప్రతినిధుల బృందం సియోల్ నగరంలోని కాలువలను పరిశీలించారు.