జగిత్యాల-కరీంనగర్ రహదారిపై సెకండ్ ఏఎన్ఎంలు శనివారం ఆందోళన చేపట్టారు. రాత పరీక్ష లేకుండా ఉద్యోగ క్రమబద్ధీకరణ చేయాలని వారు రోడ్డు పై బైటాయించి డిమాండ్ చేశారు. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సంఘటనా స్థలానికి టౌన్ సీఐ వేణు గోపాల్ చేరుకుని ఏ ఎన్ ఎం లకు నచ్చజెప్పి ధర్నా విరమింపజేశారు. ట్రాఫిక్ క్లియర్ చేపించారు.