జగిత్యాల: జన ఆరోగ్య సమితిపై వైద్య సిబ్బందికి శిక్షణ

58చూసినవారు
జగిత్యాల: జన ఆరోగ్య సమితిపై వైద్య సిబ్బందికి శిక్షణ
జగిత్యాల జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి సమీయొద్దీన్ అధ్యక్షతన జన ఆరోగ్య సమితిపై జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జన ఆరోగ్య సమితి ద్వారా ఉన్నత శ్రేణి ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలకు వార్షికంగా నిధుల కేటాయింపు జరిగింది. వీటి వినియోగంపై సీనియర్ సహాయకులకు, ఎం. ఎల్. హెచ్. పి, లకు శిక్షణ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్