గంజాయి నిర్మూలనలో తల్లిదండ్రుల పాత్ర కీలకం

61చూసినవారు
గంజాయి నిర్మూలనలో తల్లిదండ్రుల పాత్ర కీలకం
గంజాయి నిర్మూలనలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని జగిత్యాల రూరల్ సిఐ కృష్ణా రెడ్డి అన్నారు. సోమవారం సిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో యువత గంజాయికి బానిసలుగా మారితే నేరాల శాతం పెరిగే ప్రమాదం ఉంటుందన్నారు. గ్రామాల్లో గంజాయి అమ్మినా, సరఫరా చేసినా, సేవించినా వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి నిలువ, సరఫరా, విక్రయానికి సంబందించిన వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్