Dec 01, 2024, 12:12 IST/ధర్మపురి
ధర్మపురి
ధర్మపురి: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మానవ హారం
Dec 01, 2024, 12:12 IST
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో ఆదివారం రెండు కిలోమీటర్ల వాకింగ్ లక్ష్యాన్ని చేరుకొని మానవహారం నిర్వహించారు. ఆరోగ్యమే మహాభాగ్యం మొదలగు నినాదాలతో కూడిన ప్ల కార్డులు ప్రదర్శిస్తూ హుషారుగా వాకింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో బుగ్గారం ఏఎస్ఐ ప్రకాష్, ప్రవీణ్, గడ్డం రమేష్, ఆంజనేయ స్వామి, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.