AP: ప్రధాని మోదీకి వైసీపీ ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. ఢిల్లీలో కాలుష్యం నేపథ్యంలో దక్షిణాదిలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని కోరారు. ఢిల్లీ వాతావరణం సభ్యుల పనితీరుపై ప్రభావం చూపుతోందని వివరించారు. దక్షిణాదిలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తే జాతీయ సమగ్రత మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. గురుమూర్తి ప్రయత్నాన్ని తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశంసించారు.