AP: సూపర్ సిక్స్ పథకంలో భాగం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది. వీటిలో ఒక పథకమైన ‘ఆడబిడ్డ నిధి’ని వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద 18-55 ఏళ్ల లోపు మహిళలకు ప్రభుత్వం ప్రతి నెల రూ.1,500 బ్యాంక్ ఖాతాలో జమ చేయనుంది. అయితే ఈ పథకానికి అర్హత పొందాలంటే పోస్టాఫీస్‌లో అకౌంట్ ఉండాలని నెట్టింట ప్రచారం జరుగుతోంది. నిజానికి ఇది అవాస్తవం. సేవింగ్స్ అకౌంట్ లేని వారు ఖాతా ఓపెన్ చేస్తే సరిపోతుంది.