పవన్ మాటల్లో తప్పేముంది: మంత్రి నాదెండ్ల

56చూసినవారు
పవన్ మాటల్లో తప్పేముంది: మంత్రి నాదెండ్ల
AP: కాకినాడ పోర్టుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన మాటల్లో తప్పేముందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆదివారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో అధికారులను ఎవరినీ పోర్టు లోపలికి అనుమతించలేదన్నారు. 2,200 ఎకరాల కాకినాడ పోర్టులో కేవలం 20 మంది పోలీసులు మాత్రమే పెట్టారన్నారు. కాకినాడ పోర్టును తన చేతుల్లోకి తీసుకోవడానికి జగన్ ఎందుకు దౌర్జన్యం చేశారన్నారు. కేవీ రావు కుటుంబాన్ని ఎందుకు హింసించారని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్