హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్

14825చూసినవారు
హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్
మల్లాపూర్ మండల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ అశోక్ పై సస్పెన్షన్ వేటు వేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు మల్టీజోన్ ఐజి రంగనాథ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలోనీ పోలీస్ స్టేషన్ లో మార్చ్ 17న మద్యం సేవించారని సిబ్బందిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. విచారణ చేసిన అనంతరం హెడ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్