కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ప్రజా భవన్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, సిఎంఆర్ఎఫ్ చెక్కులను సోమవారం మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.