హరీష్ రావును పక్కన కూర్చోబెట్టుకొని కారు నడిపిన కేటీఆర్ (వీడియో)

68చూసినవారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు ఒకే కారులో ప్రయాణించారు. కేటీఆర్ డ్రైవింగ్ చేస్తుండగా హరీష్ పక్క సీటులో కూర్చున్నారు. వీరిద్దరు ల్యాండ్ క్రూయిజర్‌లో ప్రయాణించారు. అలాగే జడ్చర్ల పట్టణంలో పార్టీ నేతలతో కలిసి ఓ హోటల్లో టీ తాగారు. నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. జనార్దన్ రెడ్డిని పరామర్శించేందుకు వీరు ఒకే వాహనంలో కలిసి వెళ్లారు.

సంబంధిత పోస్ట్