ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించమని ఎస్పై కదిరే శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. తంగళ పెల్లి మండలం అంకుసాపూర్ గ్రామానికి చెందిన గౌరవేణి రాజు అనే వ్యక్తి రాత్రివేళా దాచారం గ్రామానికి అక్రమంగా ఇసుకను లోడ్ చేసి తరలిస్తుండగా పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించామన్నారు.