ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో శుక్రవారం ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలో ఇంటింటికి ఇంటర్నెట్ కల్పించే కార్యక్రమంలో భాగంగా పైలెట్ ప్రాజెక్టు కింద మూడు గ్రామాలను ఎంపిక చేయగా, అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చోటు కల్పించడం పట్ల మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.