రైతాంగానికి మద్దతుగా అఖిలపక్ష పార్టీల నిరసన దీక్ష

163చూసినవారు
రైతాంగానికి మద్దతుగా అఖిలపక్ష పార్టీల నిరసన దీక్ష
పెద్దపెల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ ఆదేశాల మేరకు అంబేద్కర్ చౌరస్తాలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నా నిర్వహిస్తున్న రైతులకు మద్దతుగా ఒక్కరోజు నిరసన దీక్ష శిబిరానికి టిఆర్ఎస్ పార్టీ పక్షాన మద్దతు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న మొండి వైఖరికి తగిన గుణపాఠం చెప్పే రోజులు ముందు ఉన్నాయని రైతులను బాధపెట్టే ఏ ప్రభుత్వాలు కూడా ఎక్కువ రోజులు నిలువ లేవని ఈ సందర్భంగా తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు తగరం శంకర్ లాల్, వేల్పుల గట్టయ్య, కోట రవి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరేపల్లి కుమార్, కౌన్సిలర్లు వికె.రవి, కొట్టే పద్మ రమేష్, గర్రెపల్లి సత్యనారాయణ, కోఆప్షన్ సభ్యులు సముద్రాల స్వాతి శ్రీనివాస్, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్