పెండింగ్ స్కాలర్షిప్, ఫీజురీయంబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో పెద్దపల్లిలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కళ్ళకు గంతలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బాలసాని లెనిన్, పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం మాట్లాడుతూ రాష్ట్ర సర్కార్ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతూ విద్యార్థుల పట్ల వివక్షత చూపుతోందని మండిపడ్డారు.